Aakaasham Nee Simhaasanam

ఆకాశం నీ సింహాసనం

ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం (2)
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2)
మార్గము నీవే – జీవము నీవే     

 ||ఆకాశం||

పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా (2)
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా       

||ఆకాశం||

నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా (2)
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా       

||ఆకాశం||

భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2)
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా       

||ఆకాశం||