Amoolyamaina Aanimuthyamaa

అమూల్యమైన ఆణిముత్యమా

అమూల్యమైన ఆణిముత్యమా
యెహోవ దేవుని హస్తకృతమా (2)
అపురూప సౌందర్య రాశివి నీవు
ఆత్మీయ సుగుణశీలివి నీవు (2)       

||అమూల్యమైన||

జ్ఞానము కలిగి నోరు తెరచుదువు
కృపగల ఉపదేశమును చేయుదువు (2)
ఇంటివారిని బాగుగ నడుపుచూ
వారి మన్ననలను పొందుచుందువు (2)       

||అమూల్యమైన||

చేతులతో బలముగా పనిచేయుదువు
బలమును ఘనతను ధరించుకొందువు (2)
రాత్రివేళ నీ దీపము ఆరదు
కాంతికిరణమై మాదిరి చూపుదువు (2)       

||అమూల్యమైన||

దీనులకు నీ చేతులు పంచును
దరిద్రులను నీవు ఆదుకొందువు (2)
దూరము నుండి ఆహారము కొనుచు
మంచి భోజనముతో తృప్తిపరచుదువు (2)       

||అమూల్యమైన||