Anudinam Aa Prabhuni Varame

అనుదినం ఆ ప్రభుని వరమే

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)
నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును

||అనుదినం||

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)
ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును

||అనుదినం||

అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)
సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు

||అనుదినం||