Gorrela Goppa Kaapari

గొర్రెల గొప్ప కాపరి నా యేసు

గొర్రెల గొప్ప కాపరి నా యేసు
మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు (2)
మంచి కాపరి – ప్రధాన కాపరి
ప్రేమ కాపరి – నిత్య కాపరి (2)

||గొర్రెల||

తప్పిపోయిన నన్ను – వేదకుట కొరకు
దారి తప్పిన నన్ను – రక్షించుట కొరకు (2)
కొండలు కోనలు దాటాడు
లోయలు లోతులు వెదికాడు (2)

||గొర్రెల||

జబ్బు పడి నేనున్నప్పుడు – అక్కున చేర్చాడు
మబ్బు పట్టి ఉన్నప్పుడు – గొర్రెల దొడ్డికి నడిపాడు (2)
పచ్చిక బయళ్ళు మేపాడు – శాంతి జలములకు నడిపాడు (2)

||గొర్రెల||