Krotha yedu modhalu bettenu
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందు
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభునిసేవ
తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబుజూడ
||క్రొత్త||
పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర
డెందమందు స్మరణ జేయుడి
ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వవలయు
అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా
||క్రొత్త||
బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు
కలిమి మీర గర్త వాక్కున
అలయకుండా అడుగుచుండ నలగకుండా
మోదమొంది
బలమొసంగు సర్వ విధుల నెలమి మీర
నొచ్చుచుండ
||క్రొత్త||
పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు
ప్రాపు జేరి మీరు వేడగా
సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి
పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు