Kuripinchumu devaa
కురిపించుము దేవా
హల్లెలూయా – హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
కురిపించుము దేవా – నీ ఆత్మ వర్షము
ఫలియింతును నీకై – నా జీవితాంతము
॥హల్లెలూయా॥
1. దేవుని ప్రజలందరిని – దారి మళ్ళించిన
యెజబేలును ఎదిరించిన – ఏలియా అభిషేకం
ఐగుప్తు రాజును గడగడ వణికించి
తనవారిని విడిపించిన మోషే అభిషేకం
॥హల్లెలూయా॥
2. రాకడ సమయం ఆసన్నమైనది
శక్తితో నను నింపమని మనసు మూల్గుచున్నది.
ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని
అంతకంతకు పెంచి జ్వాలగ మార్చుము తండ్రి