Kaalam Maarinaa

కాలం మారినా మనుషులే మారినా

కాలం మారినా మనుషులే మారినా.. (2)
నా యేసు ప్రేమ మారునా.. (2)
మారదూ.. మారనే మారదు.. (2)
వదకు తెబడిన గొర్రెవలే భువికి దిగివచ్చెను ప్రేమ.. – క్రూరమైన తోడేళ్ళ మధ్యలో నోరు తెరువలేదే ప్రేమ..(2)
వదించబడుతున్నా నను విడువక రక్తము క్రయధనముగా నిచ్చి (2)
నను విడిపించేను ప్రేమా.. మారని యేసు ప్రేమ (2)

||కాలం మారినా||

దిక్కులేని వానిగా నన్ను విడువలేదుగా ప్రేమ-
ఆదరణ కర్తను పంపి సేదదీర్చేను ప్రేమ (2)

అగాధ సముద్ర జలములనైనను ఆర్పజాలని ప్రేమ ఇది (2)
నను బలపరచేను ప్రేమా.. మారని యేసు ప్రేమ (2)

||కాలం మారినా||

అవసరానికి వాడుకొని త్రోసివేసె మనుషుల ప్రేమ- లోక ప్రేమనే చదరంగంలో మిగిలిపోతినే ఒంటరిగా..(2)
కాలమనే రథ చక్రముల క్రింద నలిగిపోతున్న వేల..(2)
నన్నాధుకునేను ప్రేమా.. మారని యేసు ప్రేమ (2)

||కాలం మారినా||