Kaalam Maarinaa
కాలం మారినా మారని ప్రేమా
కాలం మారినా మారని ప్రేమా
మనుషులు వీడినా విడువని ప్రేమా…
జగము మారినా యుగము మారినా…
మారదు మారదు మారనిది యేసు ప్రేమా.
నా యేసు ప్రేమా…
1. కనుగానని కామమునా కన్నబిడ్డనే బలిచేసి
చెత్తకుప్పలో పడవేసి చేతులు దులిపేసి పోయే..
తల్లిప్రేమ విషమాయే లోకం ఈ విధమాయే…
తల్లి మారినా తండ్రి వీడినా మారదు మారదు
మారనిది యేసు ప్రేమా నా యేసు ప్రేమా
||కాలం||
2. శక్తినంత ధారవోసి కనిపెంచిన తల్లి తండ్రినీ
వయసు మీరిపోయిన వేళా వీధిలో పడద్రోసిపోయే
బిడ్డ ప్రేమ విషమాయే లోకం ఈ విధమాయే
సుతులు వీడినా గతులు మారినా మారదు మారదు
మారనిది, యేసుప్రేమా నా యేసు ప్రేమా