Kaluvari Prema Neramulenchani
కలువరి ప్రేమ నేరములెంచని ప్రేమ
కలువరి ప్రేమ నేరములెంచని ప్రేమ
విడువని ప్రేమ ఎన్నడు మరువని ప్రేమ
నా భాధలో నెమ్మది నా బ్రతుకులో పెన్నిధి (2)
ఆ ప్రేమ నీవే కదా నా స్వాస్థ్యం నీవేనయ్యా (2)
1. తల్లిదండ్రుల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ గతించిపోవునుగా (2)
హద్దులే లేని ప్రేమ ప్రాణమే ఒసగిన ప్రేమ
పాపములన్నియు కడిగే ప్రేమ (2)
ఆ ప్రేమ నీవే కదా నా స్వాస్థ్యం నీవేనయ్యా (2)
|| కలువరి ప్రేమ||
2. ఇహలోక ప్రేమలు – దేవుని ప్రేమతో సాటిరావుగా (2)
నా తోడు వచ్చే ప్రేమ నిత్యము నిలిచే ప్రేమ
ఆదియు అంతము మారని ప్రేమ (2)
ఆ ప్రేమ నీవే కదా నా స్వాస్థ్యం నీవేనయ్యా (2)
|| కలువరి ప్రేమ||
3. సిలువలో చేసిన నీ రక్త అర్పనే మమ్ము రక్షించెనుగా
స్వస్థతను ఇచ్చే రక్తం – జయమును కలిగించును రక్తం
పరమపురి సియోనుకు చేర్చే రక్తం (2)
ఆ రక్తం నీవే కదా – నా స్వాస్థ్యం నీవేనయ్యా (2)