Kaluvari Kondapaina
కలువరి కొండపైనా
కలువరి కొండపైనా – వ్రేలాడే సిలువలోనా
ఏ దోషమెరుగని నిర్దోషి – ఏ పాపమెరుగని పరవాసి
॥కలువరి॥
1. కఠినులు విసిరిన కొరడాలు
దేహముపై బడి చీల్చగా
మూఢులు ఊసిన ఉమ్ములు
మోముపైన దిగకారగా
నోరు తెరువడె ఈమౌని
పాపము నాలో లేదని – ఏ నేరము చేయలేదని
॥కలువరి॥
2. మహిమలొ వెలిగే ఘనదైవం
మరణము పొందిన దీవైనం
తన పిల్లల రక్షణకోసం
తండ్రే అయ్యెను బలిదానం
తల్లడిల్లెనే ఆకాశం
చీకటాయెనె ఈ లోకం – పెనుచీకటాయెనే ఈ లోకం