Kalavaramendhuku

కలవర మెందుకు కలత చెందకు

కలవర మెందుకు కలత చెందకు
వేదనలెన్నైనా శోదనలెదురైనా సిగ్గుపడనీయ్యడూ
నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ

1. శూన్యములో ఈ సృష్టిని _
తననోటి మాటతో సృజియించినా (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే –
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

2. అలలహోరులో పెనుగాలివీచినా _
వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే –
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

3. అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా –
సింహాల మద్యన నీవుండినా (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే –
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

4. ఆకాశపు వాకిళ్ళుతెరచి _
పట్టజాలని దీవెనలొసగే (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే –
యేసయ్యా నీతో ఉంటాడులే (2)