Oka Dinamaina Gadachuna

ఒక దినమైనా గడచునా

ఒక దినమైనా గడచునా.. నీవు లేని నా జీవితానా..
ఒక క్షణమైనా ఊహించ గలనా.. నీ కృపలేని నా బ్రతుకును…

||ఒక దినమైనా||

నా ప్రాణమా నా జీవమా – యేసయ్యా నీవే నా ఆధారము.. (2)

||ఒక దినమైనా||

అలసిన హృదయముతో.. – చేరాను నీ సన్నిధి
సమస్యలతో సతమతమై – కోరాను నీ స్నేహము… (2)
ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా
సమస్యలే సంగీతమై – ఎద పాడెను స్తుతిగీతము… (2)

||నా ప్రాణమా||ఒక దినమైనా||

విరిగిన నా హృదినీ.. నీకే అర్పించేదను..
కలిగినది ఏదైనా.. నీవు ఇచ్చినదని స్తితియించేదను.. (2)
కలిమి లేమి నందు – నీ కృపను కాచుకొనగా
నీ కృపయే సోపానమై.. బహు క్యాతిని కలిగించను..

||నా ప్రాణమా||ఒక దినమైనా||

నలిగిన నా హృదయం.. నీ మందిరముగ మలచితివి…
కరుగుతున్న నా జీవితాన్ని.. ప్రకాశింప జేసితివి.. (2)
నన్ను బలపరచే.. నీ కృప ఉంటే చాలని
నా పూర్ణ హృదయముతో… ఆత్మారాధణ చేసెదను.. (2)

||నా ప్రాణమా||ఒక దినమైనా||