Ye Reethi Sthuthiyinthuno

ఏ రీతి స్తుతియింతునో

ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
ఏ రీతి స్తుతియింతునో…
నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా (2)

||ఏ రీతి||

మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2)

||నా ప్రాణ||

వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2)

||నా ప్రాణ||

ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను (2)

||నా ప్రాణ||