Yepapmerugani

ఏ పాప మెరుగని యోపావన మూర్తి

ఏ పాప మెరుగని యోపావన మూర్తి – పాప విమోచకుండ-
నా పాలి దైవమా – నా పాపముల కొర – కీ పాట్లు నొందినావా (2)

1. ముళ్ళతో గేరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా-

ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా

|| ఏ పాపమెరుగాని||

2. కలువరి గిరిదనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా =

శిలువ నీతో మోయ – తులువలు వేరొకని – దోడుగా నిచ్చినారా

|| ఏ పాపమెరుగాని||

3. చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా =

కడకు కల్వరిగిరి – కడకేగి సిల్వను – గ్రక్కున దించినావ

|| ఏ పాపమెరుగాని||

4. ఆ కాల కర్ములు – భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా =

నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది మేకులతొ గ్రుచ్చినారా

|| ఏ పాపమెరుగాని||

5. పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా =

సిలువపై బలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా

|| ఏ పాపమెరుగాని||

6. బల్లిదుండగు బంటు – బల్లెమున నీప్రక్క – జిల్లి బడ బొడచినాడా =

ఉల్లోలములవలె నల్లనీరుబుకంగ – జల్లారెగద కోపము

|| ఏ పాపమెరుగాని||

7. కటకటా పాప సం – కటము బాపుట కింత – పటుబాధ నొందినావా =

ఎటువంటి దీ ప్రేమ – ఎటువంటి దీ శాంత – మెటుల వర్ణింతు స్వామి

|| ఏ పాపమెరుగాని||