Yendukinka Kanniru

ఎందుకింక కన్నీరు ఎందుకావేదన

ఎందుకింక కన్నీరు – ఎందుకావేదన
నీ దుఖః దినములన్ని సమాప్తమైనవని
తెలుసుకో నేస్తమా – యేసయ్య మాటిది (2)

1. పరలోక మహిమను – నీ కొరకు విడిచెను
తన ప్రాణం పెట్టి – నిన్ను బ్రతికించెను (2)
ఇంత చేసినవాడు – నీకు దురమౌతాడా –
సందేహమును వీడి – సిలువ దర్శనము పొంది
బ్రతికితే క్రీస్తు కొరకు – చావైతే లాభమనుకో (2)
ప్రాణమా నాలో తొందర పడకుమా(2)

||ఎందుకింక||

2. మన్ను అడ్డు ఉందని – మొలకెత్తకుందువా
రాళ్ళు రువ్వుతారని – భరించకుందువా (2)
ఎండిన భూమిలో – మొలిచిన మొక్కవలె పెరిగెను యేసయ్య
ద్రాక్షవల్లిగా అంటు కట్టబడి నీవు – బహుగా ఫలించుమా (2)
ప్రాణమా నాలో తొందర పడకుమా(2)

||ఎందుకింక||

3. అపజయముల మధ్య – వెనుకంజ వేయకుమా
పోరాడుచున్నది – అంధకార శక్తులతో (2)
దేవుడిచ్చు సర్వాంగకవచమును – ధరించుకుని
ధూపర్తి చేబూని – స్తుతి యాగము చేయుచు
జయమే ఊపిరిగా – గురియొద్ధకే సాగిపో (2)
ప్రాణమా నాలో తొందర పడకుమా (2)

||ఎందుకింక||