Yentho Vintha Yentho Chintha

ఎంతో వింత యెంతో చింత

ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణ మంత (2)

పంతము తో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత (2)

||ఎంతో||

పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాధు నకటా (2)

అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు (2)

||ఎంతో||

మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని (2)

మొయ్యలేక మ్రాని తోడ
మూర్చబోయే నేసు తండ్రి (2)

||ఎంతో||

కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలు సేతులలో జీలల్ (2)

కఠిను లంత గూడి కొట్టిరి
ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)

||ఎంతో||

దాహము గొన చేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా (2)

ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా (2)

||ఎంతో||

బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారే నీరు రక్త మహహా (2)

ఏరై పారే యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు (2)

||ఎంతో|