Yentha Chitramo
ఎంత చిత్రమో....ఏమి చోద్యమో.....
ఎంత చిత్రమో….ఏమి చోద్యమో…..
యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో
యేసయ్యా నీ ఆగమనం ఎంత చోద్యమో
||ఎంత చిత్ర||
1. ఆకాశ మహకాశములే పట్టజాలని దేవుడవు
అణువంత రూపుదాల్చి కన్యగర్భము చేరావు
లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు
ఊహకు అందదు నీ వింత త్యాగం….
||ఎంత చిత్ర||
2. దూతలతో మహాదూతలతో మహిమనొందే దేవుడవు
ఘనమహిమ నీవు విడచి మట్టి మనిషిగ మారావు
పాపులను రక్షింప నీవు బలియాగం కాగోరినావు
ఉన్నతమైనది నీ ప్రేమ చరితం…..