Yevaru lerayya
ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య
ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య
అందరూ నాకూ ఉన్నా నే నేవరికి చెందన్నయ్య (2)
ఈ పోరాటం సమసిపోయేది ఎన్నడయ్య
నీ సన్నిదిని నేను చేరేది ఎప్పుడయ్య. (2)
౹౹ఎవరూ౹౹
అమృతమంటి అమ్మ ప్రేమను నేను పొందలేదు
భర్త యొక్క అనురాగనికైన నోచుకోలేదు (2)
కన్న బిడ్డలే శత్రువులై నను బాదిస్తున్నారు
నా బంధువులే విరోధులై నను వెదిస్తున్నారు
దిక్కు లేని నాపైన దయ చూపుము యేసయ్య
౹౹ఎవరూ౹౹
నిందలనింక సహియించి ఓపిక ఇక లేదు
అవమానాలను భరియించే దైర్యము కనరాదు (2)
నా ఉనికే అందరికి ఇలలో భారముగా ఉంది
దుఃఖముతో కంటికి కునుకె కరువైపోయింది
కనికరించి ఇకనైన నా కరమందుకొవయ్య