Evaru Unnaa Lekunnaa

ఎవరు ఉన్నా లేకున్నా

ఎవరు ఉన్నా లేకున్నా
యేసయ్య ఉంటే నాకు చాలు (2)
అందరి ప్రేమ అంతంత వరకే
యేసయ్య ప్రేమ అంతము వరకు (2)

||ఎవరు||

కునుకడు నిదురపోడు
కాపాడుతాడు నన్నెప్పుడు (2)
ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2)
రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2)

||అందరి||

తల్లి మరచినా తండ్రి విడచినా
నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2)
ముదిమి వచ్చినా తల నెరిసినా (2)
చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2)

||అందరి||

అలసిన కృషించినా
తృప్తి పరచును నన్నెల్లప్పుడు (2)
శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2)
రెక్కలు చాపి నన్ను కాపాడును (2)

||అందరి||