Ennenno vedhanalu anubhavinchadu
ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు
ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు – నిను రక్షించుట కొరకే
మన పాపం కడుగుట కొరకే (2)
వెలలేనిది.. తన త్యాగం.. కనలేనిదీ.. ఆ మరణం
విలువైన నీకోసమే – బలియాయెను
మనకోసమే (2)
క్రీస్తేసుని ఈ త్యాగము – మనకోసమే బలియాగము
నీ రక్షణే తన ద్యేయము – నువు నమ్మినచో నిత్యజీవము
||ఎన్నెన్నో||
1. ఎంతెంత అవమానము – సహియించెను తన మౌనం (2)
అన్యాయమే గెలిచిందిగా – మన శిక్షకు తను తలవంచెగా (2)
మెలిపెట్టిన కొరడాలు చీల్చేసేను తనువణువు
– ఒలికించే తన రక్తమె – మనపాప పరిహారమే
అది మనపాప పరిహారమే
||ఎన్నెన్నో||
2. శిరమంత ముండ్లేగా – పలుమార్లు దిగబడగ (2)
మోసాడు సిలువ భారమే (అది)మనఘోర పాపభారమే (2)
బంధిచెను ఆచీలలు వ్రేలాడెను తన తనువు –
విడిచేసే తన శ్వాసనే – విమోచించే మన
ప్రాణమె విమోచించె మన ప్రాణమె