Ekkado Manasu Vellipoyindi

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఏమిటో ఇటు రానే రానంది
ఆహాహా.. ఓహోహో…
నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)

అక్కడే చిక్కుకుపోయానంటుంది
బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2)

||ఎక్కడో||

జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)

దేనికీ ఇక చోటే లేదంది
యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2)

||ఎక్కడో||

ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)
అక్కడే కరిగిపోతానంటుంది
ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2)

||ఎక్కడో||