Ee Udayamuna Neevu
ఈ ఉదయమున నీవు లేచి
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2)
||ఈ ఉదయమున||
తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం (2)
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము
||ఈ ఉదయమున||
అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు కాగా (2)
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా
ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2)