Inthakaalamu Nannu Kaachenu

ఇంతకాలము నన్ను కాచెను

ఇంతకాలము నన్ను కాచెను యేసయ్య నీ కృప
రెక్కల నీడలో నన్ను దాచెను యేసయ్య నీ కృప
పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన
వీడిపోదు నీ… కృప
యేసుని కృప – అది శాశ్వత కృప

||ఇంతకాలము||

1. కృంగియున్న నన్ను లేవనెత్తె నీ కృప
కుములుచున్న నన్ను ఓదార్చె నీ కృప
నా పక్షముగా పోరాడినది
నా శోధనలో జయమిచ్చినిది

॥యేసునీ కృప|| ||ఇంతకాలము॥

2. పతనమైన బ్రతుకును సరిచేసె నీ కృప
పరిమళాల సువాసనగ మార్చె నీ కృప
నీ రాజ్యములో నను చేర్చినది
నీ స్వాస్థ్యమును నియమించినది

॥యేసునీ కృప|| ||ఇంతకాలము॥