Sthuthi Paadi Keerthinthumu

స్తుతి పాడి కీర్తింతుము

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని
మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2)
ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2)
ఆది అంతము లేనివాడు (2)
మార్పు చెందని – మహనీయుడు (2)

|| స్తుతి పాడి ||

జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2)
ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2)

|| స్తుతి పాడి ||

గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2)
తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2)

|| స్తుతి పాడి ||