Srustikartha Yesu Deva

సృష్టి కర్త యేసు దేవా

సృష్టి కర్త యేసు దేవా -సర్వ లోకం నీ మాట వినును
సర్వ లోక నాధ సకలం నీవేగా
సర్వలోక రాజ సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము. . . .

||సృష్టి కర్త||

1. కానాన్ వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్ష రసము చేసి
కన లేని అంధులకు చుపునొసగి
చెవిటి మూగల బాగుపరచితివి
నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు

||సృష్టి కర్త||

2. మృతుల సహితము జీవింపచేసి
మృతిని గెలచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నివసింప
కొనిపొవా త్వరలో రానుంటినే
నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు

||సృష్టి కర్త||