Siluvalo Needhu Keka

సిలువలో నీదు కేక - నా జీవన రేఖా

సిలువలో నీదు కేక – నా జీవన రేఖా
నీదు త్యాగాల వెనుక – ప్రేమ దాగుంది గనుకా

నా పాపమే మోసితివా
నా శాపమే భరించితివా
నేను మరువను యేసయ్యా నిను
నేను విడువను యేసయ్యా

||సిలువలో||

1. కన్నుల్లో కన్నీరు నా కోసమే
కొరడాల గాయాలు నా కోసమే
మోమున కారే ఉమ్ములు సైతం
నా కోసమే నా పాపమే

||నేను||సిలువలో||

2. దూషణ సహియించె నా కోసమే
హేళన భరియించె నా కోసమే
శిరమున దాల్చిన ముళ్ళ కిరీటం
నా కోసమే నా పాపమే

||నేను||సిలువలో||

3. దప్పిక గొన్నది నా కోసమే
చేదును త్రాగింది నా కోసమే
విడచిన ప్రాణం బల్లెపు గాయం
నా కోసమే నా పాపమే

||నేను||సిలువలో||