Sahodharulu Ikyatha Kaligi
సహోదరులు ఐక్యత కలిగి నివశించుట
సహోదరులు ఐక్యత కలిగి నివశించుట ఎంతమేలు
పరిశుద్ధులు అందరు కలసీ ఫలియించుట ఎంత మేలు
1. చిన్న జీవులైనా చీమలు చూడు ఏకమయ్యి సర్పాన్నే చంపగలుగురా
తేనెటీగలా ఐక్యత చూడు తేనెపట్టు ముట్టబోతే కలిసికుట్టురా
దయ్యాలలోన ఐక్యత చూడు ఒకనిలోనే రెండువేలు నివశించెనురా
||సహోదరులు||
2. అల్లరివైనా కాకుల ఐక్యత చూడు
ప్రతిదానికి అన్నిటిని పిలుచుకొనునురా
అడవి పందులా ఐక్యత చూడు ఒకటి వేసిన కేకకు అన్ని వచ్చురా
అపవిత్ర ఆత్మలా ఐక్యత చూడు ఒకటి వెళ్ళి ఏడింటిని వెంట తెచ్చురా ॥2॥
||సహోదరులు||
3. అంతరంగమందునా అహమునుంచితే ఐక్యత అంత చెడిపోతుంది
గర్వ హృదయము విరుగకపోతే ఏకమనసు ఎప్పటికి రానంటుంది.
దీన మనసునే సాధన చేస్తే దీవించి దేవుడిచ్చు ఏకాత్మనురా
ఆత్మయే కలిగించును ఐక్యత రా…