Samaapthamaaye Nee
సమాప్తమాయెను నీ దుఃఖ దినములు
సమాప్తమాయెను నీ దుఃఖ దినములు
సంతోషము నీకు కలుగును – సమాధాన సంగుతులే నీకు జరుగును
విశ్వసించుము శుభం కలుగును-విశ్రాంతి యేసు నీకు దయచేయును
1. ఇన్నినాళ్ళ కలతలన్ని తీరిపోవును
ఇది మొదలు యేసు నిన్ను దీవించును
రెండంతలమేలు నీకు కలుగజేయును
సంపూర్ణమైన బహుమానమిచ్చును
॥విశ్వసించుము||
2. బలహీనత తొలగించి బలమునిచ్చును
నిరంతరం బలవృద్ధిని కలుగజేయును
ఆశ్చర్యమైన క్రియలు యేసు చేయును
ఆత్మీయ ఫలములతో నిన్ను నింపును