Samayamu Poneeyaka

సమయము పోనీయక సిద్ధపడుమా

సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)
రారాజు రానైయున్నాడు
వేగమే తీసుకెళ్తాడు (2)

||సమయము||

కాలం బహు కొంచమేగా
నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా

||సమయము||

యేసు వచ్చు వేళకై
వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా

||సమయము||