Samayamide Samayamide

సమయమిదే సమయమిదే

సమయమిదే సమయమిదే
సంఘమా సమయమిదే
సీయోనులో చేరుటకు
సంఘమా సమయమిదే

||సమయమిదే||

చూడుము భూమి మీద
పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించుము
జీవ వాక్యం పట్టుకొని

||సమయమిదే||

సీయోనులో వశించు
సర్వశక్తుడు నీ ద్వారా
శోధింప ఈ దినము
మార్పునొందుము స్ఫటికముగా

||సమయమిదే||

పిలుపుకు తగినట్లుగా
నీవు నడువుము ప్రభు యేసుతో
ప్రేమలోనే నిలువుము
నిత్యజీవము చేపట్టుము

||సమయమిదే||

సీయోను రారాజు
నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటము
నీకు ఆయన ఇచ్చెదరు

||సమయమిదే||