Hey Prabhu Yesu

హే ప్రభుయేసు హే ప్రభుయేసు

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా

||హే ప్రభు||

శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ

||సిల్వ ధరా||

తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా

||సిల్వ ధరా||

మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా

||సిల్వ ధరా||

పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా

||సిల్వ ధరా||

కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా

||సిల్వ ధరా||

దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా
||సిల్వ ధరా||
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా

||సిల్వ ధరా||

ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా

||సిల్వ ధరా||

కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా

||సిల్వ ధరా||