Hrudayaaranyamulo
హృదయారణ్యములో
హృదయారణ్యములో – నేకృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు ..
1. నాకు బలము ఉన్నంత వరకు – నమ్మలేదు నా యేసుని (2)
బలమంతా పోయాక –
వెంబడించాను నా యేసుని
౹౹విని౹౹
2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు – చదువలేదు నీ వాక్యము
కనుదృష్టి పోయాక –చదవాలనివుంది నీ వాక్యము
౹౹విని౹౹
3. నేను రోగినై పడియుండినపుడు –పిలువలేదు ఏ మనుష్యుడు
పిలువగనే నా ప్రభువు – ప్రేమ చూపించే ఈ పాపిపై
౹౹విని౹౹
4. నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్
స్వరమంతా పోయాక – పాడాలని ఉంది నీ గీతముల్
౹౹విని౹౹
5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్
కృంగిపోతిని నా ప్రభువా – లేవనెత్తయ్యా – ఈ పాపిని