Yavvanulaaraa Meeru

యవ్వనులారా మీరు ప్రభు నొద్దకు రండి

యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి

సమృద్ధియైన జీవము నొందుటకు – (2)

ఆహాహా హల్లెలూయా – (6)

ప్రభు యేసు మన కొరకు

సిలువపై బలియాయెను (2)

మీ పాపమునొప్పుకొనిన (2)

క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2)

||ఆహాహా||

ప్రభు యేసుని స్వరమును వినుచు

ఆ ప్రభుని వెంబడించిన (2)

కాపాడును దుష్టుని నుండి (2)

నడిపించు నిన్ను అంతము వరకు (2)

||ఆహాహా||

చేపట్టి జీవ వాక్యము

జ్యోతుల వలె ఇహమందున (2)

ప్రభు కొరకు ప్రకాశించుచు (2)

ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2)

||ఆహాహా||

నిజ ఆహారా పానీయం

ప్రభు యేసు క్రీస్తే కాగా (2)

ఆయననే తిని త్రాగుచూ (2)

ఆ జీవముతో మనము జీవించెదము (2)

||ఆహాహా||

మృతి నొందిన మనమందరము

పై వాటినే వెంటాడెదం (2)

మన జీవము వృద్ధి నొందుచూ (2)

ప్రభు యేసుని మహిమను పొందెదము (2)

||యవ్వనులారా||