Aakarshinche Priyuda

ఆకర్షించే ప్రియుడా

ఆకర్షించే ప్రియుడా… అందమైన దైవమా…

ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైనవాడా (4)

నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది (2)

నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)

నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2)

||ఆకర్షించే||

నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)

నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)

అదియే నేను వసియించే స్థలము (2)

||ఆకర్షించే||

నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడెదను (2)

దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2)

అందరికి నిన్ను చాటి చెప్పెదను (2)

||ఆకర్షించే||