Pampumu Devaa
పంపుము దేవా దీవెనలతో
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2)
పంపుము దయ చేత పతిత పావన నామ
పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప
||పంపుము||
మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2)
యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు
||పంపుము||
వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2)
దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప
||పంపుము||
ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2)
భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి
||పంపుము||