Naatho maatladu prabhuva..
నాతో మాట్లాడు ప్రభువా
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2)
||నాతో||
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2)
||నీవు పలికితే||
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది (2)
||నీవు పలికితే||
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది (2)
||నీవు పలికితే||