Deva paapini ninnasrayinchanu

దేవా పాపిని నిన్నాశ్రయించాను

దేవా పాపిని నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2)    

||దేవా||

అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరుడై (2)
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో – (2)    

||దేవా||

కలువరిలో సిలువొంద
కలవరమొందె జగమంతా (2)
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి
మరణమునే జయించితివి

||దేవా||