Samrakshakaa vimochakaa

సంరక్షకా విమోచకా

సంరక్షకా విమోచకా
రక్షకా సంరక్షకా
ధివినే విడచి భువికేతెంచిన నిజ రక్షకుడా స్తోత్రం
పాపులకై మార్గము చూపించుటకుదయించిన రాజా స్తోత్రం
సర్వ లోక నాధా స్తోత్రం
సర్వస్థులకు అర్హుడ స్తోత్రం
మహిమా ప్రధాత స్తోత్రం
పరలోకపు ఘనతయు నీకే

బాలురందరు వృద్ధులందరు
ఎల్లరూ పాడెదం
ఉల్లాసముతో నుతియించెదము
ఇదియే సమయము

1. ఆప్తులే మమ్ము వేధించిన
మా ఓదార్పుకై రారాజు వచ్చె
ఆత్మీయులే మమ్ము బాధించిన
ఆధరణిచ్చుటకై యేసు పుట్టె
ఉద్భవించెను రాజుల రాజుగా
దిగులేల ప్రజలారా
బేత్లెహేమునందున జనియించె
అద్భుతం ఆశ్చర్యం

2. రమ్యముగా రవి ఏతెంచెను
ఈ భువికి వెలుగును ఇచ్చుటకై
లోకపు మార్గము విడిపించుటకు
పరలోకపు మార్గము తెలుపుటకు
జనియించినాడు శ్రీ యేసుడు
మరణమును జయించుటకు
బూరధ్వనితో తంబురనాధముతో
మానవాళికి శుభవార్త