Shiramu Meedha
శిరము మీద ముళ్ళ సాక్షిగా
శిరము మీద ముళ్ళ సాక్షిగా – కార్చిన కన్నిళ్ళ సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా – చిందిన రుధిరంబు సాక్షిగా
యేసు నిన్ను పిలచుచున్నాడు – నీ కొరకే నిలచియున్నాడు
1. సర్వపాప పరిహారం కోసం – రక్తప్రోక్షణం ఆవశ్యమని
మనుషులలో ఎవ్వరూ బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్యఋషులు పలికిన… ఆ… వేదసత్యం
యేసులోనే నెరవేరెనుగా
సర్వపాప పరిహరో రక్తప్రోక్షణమవశ్యం
తద్రరక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం
ఆర్యఋషులు పలికిన ఆ… వేదసత్యం
యేసులోనె నెరవేరెనుగా యేసే బలియైన పరమాత్మ
॥శిరముమీద॥
2. మహాదేవుడే యిలకేతెంచి – యజ్ఞ పశువుగా వధ పొందాలనీ
కాళ్ళలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ళ గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన… ఆ… వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా…
శ్చత్వారి శృజాత్రయో అస్య పాదాద్వే శీర్షిసప్త
హస్తాతో అస్యత్రిభూ బద్దో వృషభో రోరవీతి
మహాదేవో మర్త్యాం ఆవివేశ ఇతి
బ్రాహ్మణాలు పలికినా వేదోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞపురుషుడుగా…