Venolla Koniyaadana

వందనాలే నే చేయనా సుందరుడైన

వందనాలే నే చేయనా – సుందరుడైన
స్తోత్రాలే చెల్లించనా – నను గాచే నా రాజుకే
వందనం నా యేసయ్యా – అందుకో నా మెస్సయ్యా

॥వందనాలే||

1. అర్హతలేని నన్ను తానే
అక్కునజేర్చి ఆదరించెనే
అపరాధమేమి ఎరుగని తానే
అందరి కోసం బలియాగమాయెనే
నా యేసుకే

॥వందనాలే||

2. వేదనతోనే – కృంగియుండగా
ఆవేదన తీర్చి – నన్ను ధైర్యపరిచెనే
అన్యులలోన – ధన్యతనీయ
ఆ దేవదేవుడే – నా తోడు నిలిచెనే
నా యేసుదేవుడే – నా తోడు నిలిచెనే

॥వందనాలే||