Vijaya geethamu manasaara
విడిపిస్తాడు నా యేసుడు
విడిపిస్తాడు నా యేసుడు
మరణపు లోయైనా నను విడువడూ (2)
మనసు ఓడిపోయిననూ
మనువు వాడిపోయిననూ (2)
నను ఎత్తుకొనీ…
నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక
||విడిపిస్తాడు||
ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా
కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి
||విడిపిస్తాడు||
ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా
బండరాల్లే భాగ్యములై బ్రతుకు
భారమైననూ (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి
||విడిపిస్తాడు||
కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ
గాలి మేడలే ఆస్తులై శూన్యములే
మిగిలిననూ (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి