Langaresinaava Naa Naavaku
లంగరేసినావా నా నావకు
లంగరేసినావా నా నావకు – కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు -పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అణగగొట్టి – తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి – ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక – అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక
1)చుట్టు వున్న లోకం మాయదారి (మాయ) సుడిగుండం – నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే – నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
ఆహా ఎంత చల్లిని చూపు – ఆహా ఎంత చల్లని నీ చూపు
||అలలను అదిమిపెట్టి||
2.సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే – సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే – వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే – నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
ఆహా ఎంత చల్లిని చూపు – ఆహా ఎంత చల్లని నీ చూపు
||అలలను అదిమిపెట్టి||
3) జీవ వాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి – జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి – నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి – క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూస్తాను నీవైపు… ఊ.. ఊ.. – చూస్తాను నీవైపు ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు