Raajuvaina Naa Deva
రాజువైన నా దేవా
రాజువైన నా దేవా – రారాజువైన యేసయ్య (2)
కోటి స్వరముల స్తుతియించినా (2)
తనివి తీరదు నా మనసున (2)
ఆరాధన స్తుతి ఆరాధనా – ఆరాధన స్తుతి ఆరాధనా (3)
|| రాజువైన ||
1.కృప చూపుటలో శ్రీమంతుడా – తరతరములకు ఆరాధ్యుడా (2)
షాలేము రాజా నా యేసయ్యా – స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా (2)
ఆరాధన స్తుతి ఆరాధనా – ఆరాధన స్తుతి ఆరాధనా (3)
|| రాజువైన ||
2.నను గెలిచినది నీ త్యాగము – నడిపించింది ఉపదేశము (2)
యేసయ్యా నీ సంకల్పము – నెరవేర్చుటయే నా భారము (2)
ఆరాధన స్తుతి ఆరాధనా – ఆరాధన స్తుతి ఆరాధనా (3)
|| రాజువైన ||
3.మరణమే లేనిది నీ రాజ్యము – మహిమోన్నతమైన ఆ దేశము (2)
యేసయ్యా నీ ఘన నామము – మారుమ్రోగునే ప్రతి నిత్యము (2)
ఆరాధన స్తుతి ఆరాధనా – ఆరాధన స్తుతి ఆరాధనా (3)