Mantinaina Nannu

మంటినైన నన్ను మహిమకు

మంటినైన నన్ను మహిమకు మార్చుటకు
క్షయమైపోవు నన్ను – అక్షయతకు మార్చుటకు (2)
మ్రుత్యుంజయుడవైతివే -మహిమ స్వరూపుడా
సమాధి గెలిచితివే – పునరుత్దానుడా (2)
యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా (2)

|| మంటినైన నన్ను||

1. నీ ప్రకృతి ఊహలలో – ప్రథమ ఫలమైయుండాలని
నరుని నిర్మించినావు – నీవు ఈ నేలమంటితో (2)
ఈ ప్రథమ ఫలముకే – సీయోను స్వాస్థ్యము చేసి (2)
ఎడురుచూచుచున్నావు – పరిశుద్దతనే వారధి చేసి (2)
యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా (2)

|| మంటినైన నన్ను||

2. ఈ ఆత్మీయ రణరంగములో – నీ పక్షముగా ఉండాలని
నా మీద పోసినావు – నీ అభిషేక తైలమును (2)
పరాక్రమ శాలినై – శత్రువును చీల్చుచూ
నీ సైన్యాదిపతినై – రాజ్యమునే కట్టెదను (2)
యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా (2)

|| మంటినైన నన్ను||

3. నా మరణమునకు ఆవల – సిద్దపరచుచుంటివే
బంగారు వీధులలో – ఒక శ్రేష్టమైన అంతఃపురం (2)
రాజువైన నీ వంశములో – యాజకత్వము చేసి
జయించిన రాజునై – ప్రవేశించెద నా పురములో (2)
యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా (2)

|| మంటినైన నన్ను||