Modhati Prema Vidachithiva
మొదటి ప్రేమ విడచితివా
మొదటి ప్రేమ విడచితివా ప్రియమైన నేస్తమా
మొదటి గురిని విడచితివా ప్రియమైన బంధమా
యేసు నిన్ను విడువకముందే సరిచూసుకో నేస్తమా
సరిచేసుకో – నేస్తమా
1. గంటల తరబడి చేసిన ప్రార్థన
నేడు నీకు విసుగాయెనా
రాత్రి పగలు చదివిన వాక్యము
నేడు నీకు వెగటాయెనా – మొదటి ఆశ తరుగాయెనా
॥మొదటి ప్రేమ||
2. వీడిన లోకము పాపపు మోహము
తిరిగి నీలో మొదలాయెనా
ప్రాణ ప్రధమైన సాక్ష్య జీవితము
నిర్లక్ష్యము ఆయెనా – నీ రోషం పోయెనా
॥మొదటి ప్రేమ||
3. ఆత్మల రక్షణ కొరకైన భారము
నేడు నీలో కరువాయెనా
అపవాదిని ఎదిరించిన నీవు
అతని వలకే పరిగెడుతున్నావా
ఆత్మను అంతగ ఆర్చుకున్నావా