Melu Cheyaka Neevu
మేలు చేయక నీవు ఉండలేవయ్య
మేలు చేయక నీవు ఉండలేవయ్య – ఆరాధించక నేను ఉండలేనయ్య (2)
యేసయ్యా యేసయ్యా (2)
|| మేలు చేయక ||
1.నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండలేక
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది
|| యేసయ్యా ||
2.ఆరాధించే వేళలందు – నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో – నేను పాపినని గ్రహింయిన్చగానే
నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్
నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి – కనుగొంటిని నీతో చేరి
|| యేసయ్యా ||
3.పాపములు చేసాను నేను – నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు – ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని
నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ – నిన్నే కలిగి ఉన్నందుకు