Memu Bhayapadamu
మేము భయపడము
మేము భయపడము – ఇక మేము భయపడము
ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2)
||మేము||
దైవ భ్రష్టులమైన మమ్ము
దివ్యంపుగా రక్షించే (2)
దీవారాత్రులు దేవుడే కాయును
||మేము||
శత్రు కోటి మమ్ము జుట్టన్
పాతాళము మ్రింగ జూడన్ (2)
నిత్యుడు యేసు నిత్యము కాయును
||మేము||
అగ్ని పరీక్షల యందు
వాగ్ధానమిచ్చె మాతో నుండ (2)
ఏ ఘడియైనను విడువక కాయును
||మేము||
బలమైన ప్రభు హస్తములు
వలయము వలె మమ్ము జుట్టి (2)
పలు విధములుగా కాపాడు మమ్ము
||మేము||
కునుకడు మన దేవుడు
యెన్నడు నిద్రించడు (2)
కను పాపగా మము కాపాడునెప్పుడు
||మేము||
జీవిత కష్ట నష్టములు
ఆవరించి దుఃఖపరచ (2)
దేవుడొసంగిన ఈవుల నెంచుచు
||మేము||
ఇహమందు మన శ్రమలన్ని
మహిమకు మార్చెడు ప్రభున్ (2)
మహిమపరచి మ్రొక్కెదములలో