Moodu Dashaabdaala

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని
దీవించిన దేవా నీకు వందనం (2)
వందనం వందనం…
వందనం నీకే మా వందనం (2) దేవా

||మూడు దశాబ్దాల||

పాపులమైన మమ్మును
వెదకి రక్షించినందుకు
ఏమియు లేని మాకు
అన్నిటిని నొసగినందుకు (2)

||వందనం||

బలవంతులుగా చేసి
మూడు బాణాలను ఇచ్చినందుకు
మా భోజనపు బల్ల చుట్టు
ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2)

||వందనం||

మా కష్టాలలో, దుఃఖాలలో
మమ్ము కాచిన దేవా
మా వ్యాధులను, బాధలను
తీర్చిన దేవా (2)

||వందనం||