Maaraali Maaraali
మారాలి మారాలి మనపాత రోత బ్రతుకు మారాలి
మారాలి మారాలి మనపాత రోత బ్రతుకు మారాలి
చేరాలి చేరాలి యేసుని పాదాల చెంత చేరాలి
దీపమున్న నాడె ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిది
శక్తివున్ననాడె భక్తిలోన వుంటే చాలా మంచిది
యౌవ్వనకాలం యేసులోన వుంటే ఇంకా మంచిదీ మరీ మంచిది
॥మారాలి||
లోకపు కడలిలో లోతున పడివున్నా
లేపగ యేసు చెయ్యి చాచి వున్నది
పాపపు జగతిలో సతమత మౌతున్నా
రక్షణ నీయగా పిలుచుచున్నది
ప్రేమ మాట విని యేసు బాటలోని కొస్తే మంచిది
బాటలోనికొచ్చి మాట మారకుంటే చాలా మంచిది
యేసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది మరీ మంచిది
॥మారాలి||
చీకటి బ్రతుకులో మాటు దాగివున్నా
నిను గమనించు యేసు కన్నులున్నవి.
శాపములో బడి నశియించుచున్నా
నీకె కన్నీరు కార్చుచున్నది
తప్పుదాచి పెట్టకుండ నువ్వు ఒప్పుకుంటే మంచిది
ఒప్పుకున్న తప్పు చెయ్యకుండవుంటే చాలా మంచిది
యేసు వైపుచూచి నిన్ను దిద్దుకుంటే ఇంకా మంచిది మరీ మంచిది