Maatladumayya

మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం

మాట్లాడుమయ్యా – ఓ వాక్య దైవం
మండించుమయ్యా – మా దీన హృదయం

చూపించుమయ్యా నీ మహిమతేజం
తొలగించుమయ్యా మా పాత నైజం

1. నీ మాటలు వినబడగానే – వెలుగు కలుగు మా కన్నులకు
నీ మాటలో పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు
కృంగియున్నవారిని లేవనెత్తె నీ స్వరము
చెదరిన మా గుండెలను ఆదరించె నీ పదము

॥మాట్లాడుమయ్యా॥

2. మనుషులిచ్చు ఓదార్పు – మాన్పలేదు నిట్టూర్పు
నీ మాటల నెరవేర్పే – మాన్పుతుంది అంగలార్పు
లోకమెంత మారినా మారదయ్య నీ మాట
లోపాలపు సరిచేసి – నడుపుమయ్య నీదు బాట

॥మాట్లాడుమయ్యా॥